ప్రభుత్వం ఎదుట తీన్మార్ మల్లన్న మరో డిమాండ్

by Gantepaka Srikanth |
ప్రభుత్వం ఎదుట తీన్మార్ మల్లన్న మరో డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమని, అయితే ఆ వర్సిటీలో రిజర్వేషన్లనూ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. దీని వలన నిమ్న వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ..ఉత్పత్తి, ఉపాధి రంగాల్లో వృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ఇతర దేశాలు స్కిల్స్ లో ముందంజలో ఉన్నాయని, వాటిని ఢీ కొట్టేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానంలో నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగిన విషయం అన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ స్కిల్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకోసం పాఠశాల నుంచే నైపుణ్యత కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలోని విద్యార్ధులు, యువత వంద శాతం క్వాలిఫైడ్ గా తీర్చిదిద్దబడతారన్నారు.

Advertisement
Next Story