- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫలించిన CM రేవంత్ చర్చలు.. తెలంగాణలో పెట్టుబడులకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోపెట్టుబడులు పెట్టేందుకు కార్నింగ్ కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి.