- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎమ్మెల్యే గారు ముద్దు పెట్టండి’.. చిరుమర్తి ఇంటి ఎదుట BJP మహిళా నేత ఆందోళన (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అనూహ్య పరిణామం ఎదురైంది. బీజేపీ మహిళా నేతలపై ఎమ్మెల్యే లింగయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నార్కట్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద బీజేపీ మహిళా నాయకురాలు గురువారం ఆందోళన కార్యక్రమం చేశారు. కాగా, మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ శ్రేణులు మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ విమర్శలపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మె్ల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అవినీతి పరులందరూ పెవిలియన్ బాట పడతారని, అవినీతిపరులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కవిత దొంగ దందా చేస్తున్నారని, అవినీతి చేసినప్పుడు నోటీసులు ఇవ్వకుంటే ముద్దు పెట్టుకుంటారా?’ అని బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.కాగా, బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. బీజేపీ నేతల భార్యలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్యలు ముద్దులు పెడతారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. చిరుమర్తి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చిరుమర్తికి వ్యతిరేకంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. తాజాగా.. ఇవాళ నల్లగొండ జిల్లాకు చెందిన బీజేపీ ఉపాధ్యక్షురాలు అయితగాని కవిత ఎమ్మెల్యే లింగయ్యపై సీరియస్ అయ్యారు. గురువారం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ‘ఎమ్మెల్యే లింగయ్య గారు ముద్దు పెట్టండి’ అంటూ ఇంటి ఎదుట ఆందోళన చేశారు.