కాలేజీ కుంభకోణాలపై సోషల్ ఆడిట్ జరగాలి: బక్క జడ్సన్

by Seetharam |
కాలేజీ కుంభకోణాలపై సోషల్ ఆడిట్ జరగాలి: బక్క జడ్సన్
X

దిశ,హన్మకొండ: హన్మకొండ జిల్లా కేంద్రం లోని లాల్ బహదూర్ కళాశాల కుంభకోణాలపై సోషల్ ఆడిట్ జరగాలని కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ డిమాండ్ చేసారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. ఎల్.బి కళాశాలలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిధులకు సంబంధించిన తీవ్రమైన ఆర్థిక కుంభకోణాలను గుర్తించారని చెప్పారు. గత 8 సంవత్సరాలలో కళాశాల అభివృద్ధి నిధులు, ప్రత్యేక రుసుము ఖాతాలు, యుజిసి నిధులను ఎటువంటి భయం లేకుండా కళాశాల కార్యదర్శులు దారి మళ్లించారని ఆరోపించారు .110 మంది విద్యార్థుల హాస్టల్ సదుపాయం కోసం యుజిసి (UGC) 1.1 కోట్లు మంజూరు చేసిందని భవనం రెండవ అంతస్తులో నిర్మించని గదుల విషయంలో సమర్పించిన తప్పుడు వినియోగ ధృవీకరణ పత్రం అసంపూర్ణంగా ఉందన్నారు.

కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, పుస్తకాల కొనుగోలు లైబ్రరీ షెల్ప్ మొదలైన వాటికి అదనంగా యుజిసి (UGC) రూ.1 లక్ష మంజూరు చేసిందని తప్పుడు రశీదులు కల్పిత వినియోగ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం ద్వారా అవినీతి చోటు చేసుకొందని ఆరోపించారు. స్పోర్ట్స్ సదుపాయం కోసం సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.12.0 లక్షలను యూజీసీ మంజూరు చేస్తే .. తాత్కాలిక ఇసుక పొర వేసి లక్షల్లో కాజేసారన్నారు. ఎల్. బి కాలేజి మోసాలకు పాల్పడిన సభ్యులను శిక్షించాలని..యుజిసి (UGC) దర్యాప్తు చేసి సౌకర్యాలను పునర్నిర్మించాలని కోరారు.

Advertisement

Next Story