కొందరివాడు కాదు అందరివాడు అంబేద్కర్ : స్పీకర్

by Kalyani |
కొందరివాడు కాదు అందరివాడు అంబేద్కర్ :  స్పీకర్
X

దిశ,మర్పల్లి: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అడుగుజాడల్లో యువత నడవాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో శ్రీ చైతన్య అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం స్పీకర్ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన పేరు గుర్తుండి పోతుందినీ, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు పాలన సజావుగా సాగుతుంది అంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ద్వారా నే అని పేర్కొన్నారు. ఒక కులానికి లేదా ఒక మతానికి చెందిన వారు కాదని ఈ దేశ ప్రజల అస్థి అని కొనియాడారు.

అంబేద్కర్ ఆలోచనల అనుకూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నా రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని అప్పుడే సమాజంలో అసమానతలు తొలగి సంతోషంగా ఉండగలుగుతామన్నారు. అంబేద్కర్ పోరాట స్ఫూర్తి నేటి యువత ఆదర్శంగా తీసుకొని జీవిత లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడెం రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ చామల రఘుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, వైస్ చైర్మన్ పసియోద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్, యూత్ అధ్యక్షుడు జగదీశ్వర్ (లడ్డు పటేల్) కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ యాదవ్, రామేశ్వర్, రాచన్న, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసుల సురేష్, పట్లూరు మాజీ ఎంపీటీసీ మహేష్, మోరంగపల్లి సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె సురేష్ యాదవ్, మల్ రెడ్డి, మన్నే పాండు, ఈశ్వర్, పట్నం అశోక్, శ్రీ చైతన్య అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed