Sridhar Babu: తెలంగాణతో సంబంధాల పట్ల తుర్కియె ఆసక్తి

by Gantepaka Srikanth |
Sridhar Babu: తెలంగాణతో సంబంధాల పట్ల తుర్కియె ఆసక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(భారత్‌)తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కియె(Turkiye) దేశపు రాయబారి ఫిరట్ సునెల్(Firat Sunel) వెల్లడించారు. శుక్రవారం ఆయన ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో సచివాలంయలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇద్దరు అరగంట సేపు పరస్పర సహకారంపై చర్చించారు. తుర్కియె తెలంగాణల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతారణం ఉందని ఆయన చెప్పారు. తుర్కియె పారిశ్రామిక ప్రతినిధుల బృందాన్ని పంపిస్తే వారు ఇక్కడి ఎకోసిస్టమ్‌ను పరిశీలించే అవకాశం ఉంటుందన్న అభ్యర్థనకు రాయబారి ఫిరట్ సునెల్ సుముఖత వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed