Allu Arjun-CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్‌‌ సర్కార్‌పై ప్రశంసల జల్లు

by Ramesh N |
Allu Arjun-CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్‌‌ సర్కార్‌పై ప్రశంసల జల్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సంధ్య థియోటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం రేవంత్ నిర్ణయం సూపర్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు ప్రశంసలు తెలుపుతున్నారు.సెలబ్రీటిల కంటే, సామాన్యుల ప్రాణాలే ముఖ్యం అంటూ, సీఎం రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో చట్టం అందరికీ సమానమేనని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక మహిళ మృతికి కారణమైన వ్యక్తులపై చట్టపరంగా సీఎం రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొంటున్నారు.

కాగా, సంధ్య థియోటర్‌ ఘటనలో అల్లు అర్జున్, టీమ్ నిర్లక్ష్యంతో సామాన్య మహిళ రేవతి మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కొడుకు పరిస్థితి విషమంగా మారింది. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా సినిమా కోసం అల్లు అర్జున్, టీమ్ అత్యుత్సాహంగా ప్రవర్తించడంతో సామాన్యురాలు రేవతి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దీంతో మహిళ రేవతి మృతికి కారణమైన అల్లు అర్జున్, టీమ్, థియోటర్‌పై చట్టపరంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సీఎంపై ప్రశంసలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed