ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా.. ఆ ఇద్దరు మాత్రం..

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 08:35:03.0  )
ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా.. ఆ ఇద్దరు మాత్రం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం దైవసాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దనసరి అనసూయ (సీతక్క) సైతం దైవసాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అనే ప్రమాణం చేశారు. అందరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయగా దామోదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లీషులో చేశారు. సోనియాగాంధీని కొండా సురేఖ ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించడంతో పాటు కొండా సురేఖ. భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

Next Story