అలర్ట్: వచ్చే వారంలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లోనే..!

by Anjali |
అలర్ట్: వచ్చే వారంలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లోనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రాబోయే 5రోజుల్లో రాష్టాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులతో కూడిన మోస్తారు వర్షం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర పశ్చిమ బెంగాల్ సిక్కింలలో ఆది, మంగళవారాల్లో వరుసగా భారీ వడగళ్ల వార్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి బులెటిన్ పేర్కొంది. ఒడిశాలో ఈరోజు (ఏప్రిల్) రేపు, బీహార్‌లో సోమవారం వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా. ఇక ఇతర రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాల జాబితాను రిలీజ్ చేసింది.

మరో రెండు రోజుల్లో ఈశాన్య ప్రాంతంలో ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మొదలై.. మోస్తరు వర్షాలు కురుస్తాయని, అనంతరం క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో ఈరోజు ఎక్కువగానే వానలు ఉన్నాయి. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని తూర్పు ప్రాంతాల్లో , ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మహేల, కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో, అంతర్గత కర్ణాటకలో రాబోయే 4రోజుల పాటు తేలికపాటి వర్షం ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం వడగళ్ల వానలు,

మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడాలో 5 రోజులు, గుజరాత్‌లో బుధ, గురువారాల్లో ఉంటుంది. ఇక రానున్న 24 గంటల్లో పశ్చిమ రాజస్థాన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed