టెన్త్ క్లాస్ విద్యార్థులకు అలర్ట్.. TSRJC అప్లికేషన్ గడువు పెంపు

by Hamsa |
టెన్త్ క్లాస్ విద్యార్థులకు అలర్ట్.. TSRJC అప్లికేషన్ గడువు పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ కీలక అప్డేట్ ఇచ్చింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీ (టీఎస్‌ఆర్జేసీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే దరఖాస్తు గడువును పొడింగించింది. మార్చి 31వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా.. దీన్ని ఏప్రిల్‌ 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రకటించింది.

పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా రాష్ట్రంలోని 35 జూనియర్‌ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు. ఇంగ్లీష్ మీడియాలోనే ఈ సీట్లు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed