‘కాళేశ్వరం’ ఇప్పటికైనా మూసేస్తే.. లక్ష కోట్లు కాపాడొచ్చు: Akunuri Murali

by Mahesh |   ( Updated:2023-10-26 06:55:50.0  )
‘కాళేశ్వరం’ ఇప్పటికైనా మూసేస్తే.. లక్ష కోట్లు కాపాడొచ్చు: Akunuri Murali
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ లోని పది పిల్లర్లు మళ్లీ కట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక అంచనా వేసింది. పునరుద్ధరణ పనులు చేస్తామని ఎల్ అండ్ టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ అకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా ఇవాళ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. కాళేశ్వరం చెత్త ప్రాజెక్టు అని, అది ఎప్పటికైన మూసేసుడే అని గత ఆరు ఏళ్ళ నుంచి చెప్తురాని గుర్తుచేశారు.

కేసీఆర్ అహంకార అవినీతి వైఖరి వలన లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికైనా ఇది మూసేస్తే ఇంకో లక్ష కోట్లు కాపాడుకోవచ్చని హితువు పలికారు. కాగ్( సీఏజీ) నివేదిక ప్రకారం ఇంకా రూ. 52 వేల కోట్లు ఖర్చుపెడితేనే ప్రాజెక్టు పూర్తి అవుతుందని, రూ. 25 వేల పంటకు లక్ష ఖర్చు.. 36 లక్షల ఎకరాలు అని లక్ష ఎకరాలు కూడా నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed