- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sampath Kumar : ఎస్సీ వర్గీకరణపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ(Classification of SC Reservations)పై కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government Stand) వైఖరిపై ఏఐసీసీ కార్యదర్శి(AICC Secretary) సంపత్ కుమార్(Sampath Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. వర్గీకరణను ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎలాంటి ఆందోళన చేయనవసరం లేదన్నారు.
మాదిగల కోసం సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన ఏకైక ముఖ్యమంత్రి అని సంపత్ కుమార్ గుర్తు చేశారు. ఏక పక్ష కమిషన్ రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తోందన్నారు. పీఏసీ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతం అని నేను స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలసీకి విరుద్ధంగా మా పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కానీ, ఇంకెవరైన మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధమే అవుతోందన్నారు. దానిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నానని చెప్పారు.
మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తాం అని హరీష్ రావు, కేటీఆర్ అంటుడటం హాస్యాస్పదమన్నారు. ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ను ఢిల్లీకి తీసుకపోదాం అని నేను అసెంబ్లీలో అంటే..పదేండ్లు బీఆర్ఎస్ నాయకులు నోరు మెదుపలేదన్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే మాదిగల కోసం అసెంబ్లీలో గొంతెత్తాడని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపైన, సుప్రీం కోర్టు తీర్పుపైన ప్రకటన చేశారన్నారు. వర్గీకరణ అమలు దిశగా కేబినెట్ సబ్ కమిటీ సైతం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
కాగా సంపత్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యం విశ్లేషిస్తే సహజంగానే కాంగ్రెస్ లోని మాల వర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుండటంతో పార్టీలో ఏకాభిప్రాయం సాధించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు కొనసాగిస్తుంది.