- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Aghori:వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని అఘోరీ హల్‌చల్!

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది(2024) అఘోరీ(Aghori) మాత హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత కాలంగా కనిపించకుండా పోయిన లేడీ అఘోరీ మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అఘోరీ మాత కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాల్లో పర్యటిస్తూ హల్‌చల్ సృష్టించిన విషయం తెలిసిందే.
నిన్న(ఆదివారం) తన కారులో ఉన్న తల్వార్‌తో ఉండ్రుగొండ గ్రామంలో గ్రామస్తులపై దాడికి యత్నించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) ఉదయం వల్లభాపురం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తన కారును అడ్డంగా పెట్టి సుమారు గంట సేపు రచ్చ చేసింది. ఇక నిన్న రాత్రి నుంచి స్థానిక పోలీసులు అడుగడుగునా గమనిస్తూనే ఉన్నారు. అయితే అఘోరీ మాత గతంలో ఫిబ్రవరి 3వ తేదీన వేములవాడలోని దర్గాను కూల్చివేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో పోలీసులతో అఘోరీ వాగ్వాదానికి దిగింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాను నేడు(సోమవారం) కూల్చివేస్తానని గతంలోనే అఘోరి ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన రాజన్న సన్నిధికి వస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తోన్న అఘోరీని జిల్లా సరిహద్దు జిల్లెల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయినా అఘోరీ మాత వినకుండా నేను వెళ్లాలంటూ వాదించింది. ఎంత వారించిన వినకపోవడంతో పోలీసులు అఘోరీ కారును లాక్కెళ్లారు.