- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్సీ పదవిపై అడ్వైజర్ల ఫోకస్..! బరిలో ఆ ముగ్గురు నేతలు

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ముగ్గురు సీఎం సలహాదారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి తమ మనస్సులోని మాటను వివరించినట్టు ప్రచారం జరుగుతున్నది. అధిష్టానం ఆశీస్సుల కోసం లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ముగ్గురు లీడర్లు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, షబ్బీర్ అలీలను అడ్వయిజర్లుగా నియమించుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులను దక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా అసెంబ్లీ కోటాలోని 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాల్లో గెలిచే శక్తి కాంగ్రెస్‌కు ఉంది. అందులో ఒకటి మజ్లిస్‌కు ఇస్తారనే టాక్ ఉంది.
టీడీపీ నుంచి సీఎం వేంటే నరేందర్ రెడ్డి
2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి ఒకేసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇద్దరు మధ్య ఏర్పడిన స్నేహం కష్టాల్లో కూడా చెదిరిపోకుండా కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు ఒకేసారి టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల్లో వేం నరేందర్ కీలకంగా వ్యవహరించేవారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పబ్లిక్ ఎఫైర్స్ అడ్వయిజర్‌గా నరేందర్‌ను అపాయింట్ చేశారు. అటు పాలన, ఇటు రాజకీయ అంశాల్లో సీఎంకు నరేందర్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటారని టాక్ ఉంది. సీఎంను కలిసేందుకు కుదరకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు వేం నరేందర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తుంటారు. నాడు వైఎస్‌కు కేవీపీ ఎలాగో.. ఇప్పుడు రేవంత్‌కు వేం నరేందర్ అంతేనని కామెంట్ చేస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉంది. ఈ లోపు పెద్దల సభకు వెళ్లాలని వేం నరేందర్ ఆశ పడుతున్నట్టు ప్రచారం ఉంది. ఇదే విషయాన్ని ఆయన సీఎంకు కూడా చెప్పినట్లు చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కుదిరితే మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్లాన్‌లో వేం నరందర్ ఉన్నట్టు ప్రచారం ఉంది.
సీఎం, హైకమాండ్‌కు హర్కర క్లోజ్
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో హర్కర వేణుగోపాల్ కొనసాగుతున్నారు. అధిష్టానానికి విధేయుడు, సన్నిహితుడనే పేరుంది. ఎందుకంటే ఆయన చాలా కాలంగా పీసీసీ ప్రొటోకాల్ వ్యవహరాలు పర్యవేక్షించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు దగ్గరయ్యారు. ఆయన కోర్ టీంలో చేరిపోయారనే టాక్ ఉంది. సీఎం రేవంత్ హర్కరను ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్ అడ్వయిజర్‌గా నియమించారు. రెగ్యులర్‌గా సీఎంను కలిసే లీడర్లలో హర్కర ఒక్కరు. ప్రభుత్వం, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు రేవంత్‌కు రిపోర్టులు పంపుతారని ప్రచారం ఉంది. చాలా కాలంగా పార్టీ ప్రొటోకాల్ బాధ్యతలు చూసిన వేణుగోపాల్‌కు ఏఐసీసీలోని చాలా మంది పెద్ద లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు టాక్. దీనితో ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం సీఎంతో పాటు అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
హైకమాండ్‌కు సన్నిహితుడు షబ్బీర్
మాజీ మంత్రి షబ్బీర్ అలీ రేవంత్ సర్కారులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుడిగా పనిచేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజమాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన లీడర్లకు ఎలాంటి పదవులు ఇవ్వొద్దని అధిష్టానం కండీషన్ పెట్టింది. కానీ, షబ్బీర్‌కు సలహాదారుడు పదవి ఇచ్చేందుకు డిల్లీ లీడర్లను రేవంత్ ఒప్పించేందుకు తీవ్రంగా కష్టపడినట్టు కాంగ్రెస్ నేతలు తమ ఇంటర్నల్ మీటింగ్‌లో ప్రస్తావిస్తుంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు షబ్బీర్ అధిష్టానం వద్ద తనకు ఉన్న అన్ని పరిచయాలను ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో మైనార్టీ వర్గం నుంచి సీనియర్ లీడర్లు ఎవరూ లేరని, తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆ వర్గాన్ని పార్టీకి దూరం కాకుండా కృషి చేస్తానని షబ్బీర్ ఢిల్లీ నేతలకు వివరిస్తున్నట్టు తెలిసింది.