ఎయిర్ ఫైబర్ సేవల కోసం ఎదురుచూపులు.!

by Sumithra |
ఎయిర్ ఫైబర్ సేవల కోసం ఎదురుచూపులు.!
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ సేవల ప్రారంభం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మారుమూల గ్రామాల్లోనూ మెరుగైన సేవలు అందించడానికి ఎయిర్ ఫైబర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలలు గడుస్తున్నా మండల వాసులకు అందని పరిస్థితి ఏర్పడింది. పలువురు వినియోగదారులు సంబంధిత శాఖ అధికారులకు సంప్రదిస్తున్న పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

సేవలు అందుబాటులోకి వస్తే సామాన్యులకు సైతం తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలు అందే అవకాశాలున్నాయి. టీవీ, మొబైల్ డేటా, ఎలాంటి అంతరాయాలు లేకుండా ఇంట్లో వారందరికీ వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. సంబంధిత శాఖ అధికారులు స్పందించి త్వరలోనే ఎయిర్ ఫైబర్ రావాలని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు. సంబంధిత శాఖ ఏఈ వివరణ కోరగా ప్రైవేట్ సిటీ కేబుల్ వాళ్లకు అప్పజెప్పారని త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed