- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన బుగ్గ దేవాలయం
దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బుగ్గ జాతర మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు బుగ్గ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాటు చేశారు. వేడుకలను పురస్కరించుకొని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌తో కలిసి బుగ్గ టెంపుల్‌ను సందర్శించారు. ఏర్పాట్లను ఆలయ కమిటీతో అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ అశోక్ కుమార్ సూచించారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. దర్శనం కోసం ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. డీసీపీ అశోక్ కుమార్, ఏసీబీ రవికుమార్ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దిన్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ ఎన్ దేవయ్య, తాళ్ల గుజ్జులు ఎస్సై నరేష్, బుగ్గ దేవాలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి పాల్గొన్నారు.