- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దిశ, ఆసిఫాబాద్: ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులైన చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ. డీఈవో బిక్షపతి. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కోవ హనుమంతరావు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రఘులతో కలిసి ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో లబ్ధిదారులను గుర్తించడం పై గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం జిల్లాలోని 334 గ్రామపంచాయతీలు. 2 పురపాలక సంఘాల పరిధిలో 18 రకాల చేతి వృత్తుల వారి నుంచి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.
అర్హులైన వారిని గుర్తించి వివరాలను జిల్లాస్థాయి అమలు కమిటీకి సమర్పించాలని తెలిపారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి 18 సంవత్సరాలు నిండిన వారి కుటుంబం లో ఒకరికి పథకం వర్తిస్తుందన్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్. బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు వివరాలను దరఖాస్తుతో జతపర్చాలని సూచించారు. కాగా గ్రామపంచాయతీల్లో 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయడంతో పాటు గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా చూడాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. దస్నాపూర్ కాలనీలో అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించి.టీఎస్ ఎన్పీడీసీఎల్, జీరో కరెంటు బిల్లులను పలువురు లబ్ధిదారులకు అందజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి. కరెంట్ బిల్లులో జీరో బిల్లు రాకుంటే ఎంపీడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రానికి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.