తమిళనాడులో నిర్మల్ వాసుల బతుకమ్మ సంబరాలు..

by Sumithra |
తమిళనాడులో నిర్మల్ వాసుల బతుకమ్మ సంబరాలు..
X

దిశ, నిర్మల్ కల్చరల్ : తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో గల ఎత్తైన కొండప్రాంతం 'దొడబెట్ట శిఖరం' వద్ద బతుకమ్మ పండగను నిర్మల్ జిల్లావాసులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పాటలతో సంప్రదాయ నృత్యాలుచేస్తూ వేడుకలను నిర్వహించారు. విజ్ఞాన విహారయాత్రలో భాగంగా నిర్మల్ నుండి ఊటీ ప్రాంతానికి వెళ్లిన నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన బృందం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగని అక్కడే నిర్వహించారు.

తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని, తమిళనాడు నేలపై ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని విహారయాత్ర బృందసభ్యులు పేర్కొన్నారు. ఈ వేడుకలో సూర్యకళ, సుమలత, రచన, వరలక్ష్మీ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story