- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు బానిస సమ్మేళనం : బి.సంజయ్ కుమార్
దిశ, మందమర్రి : చెన్నూరు నియోజకవర్గం వ్యాప్తంగా పాలకులు ఏర్పాటు చేస్తున్నవి ఆత్మీయ సమ్మేళనాలు కాదు... బానిస సమ్మేళనాలని తెలుగుదేశం పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు బి సంజయ్ కుమార్ విమర్శించారు. 2014, 19 సంవత్సరంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆ మున్సిపల్ ఎన్నికలు ఎందుకు జరిపించలేదో ప్రజలకు చెప్పాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా కంపెనీ స్థలాలలో గృహాలు నిర్మించుకున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తుంటే మందమర్రిలో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని అన్నారు. ఇక ఇదిలా ఉండగా మందమర్రిలో నున్న సింగరేణి గృహాలు టీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి ఎందుకు పోతున్నాయో కూడా ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు.
మందమర్రి మున్సిపాలిటీని సిరిసిల్ల సిద్దిపేటగా దశదిశలు మారుస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన బాల్క సుమన్ నీ అభివృద్ధి ఎక్కడుందో చెప్పవలసిన అవసరం ఉందని నిలదీశారు. 18 నెలల్లో తెలంగాణ సచివాలయం కట్టిన ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ గృహాలు 8 సంవత్సరాలు పూర్తయినా ఎందుకు కావడం లేదో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు ఎండి షరీఫా, పట్టణ మహిళా ఇంచార్జి ఆర్ జయ, అధికార ప్రతినిధి గోలేట్ సురేందర్, జిల్లా నాయకులు వాసాల సంపత్, ఒడ్నాల సత్యనారాయణ, జూపాక సంధ్య, పొడిశెట్టి సువర్ణ, కోడివారి కవిత, వనిత, పసికంటి హరి, పిల్లి శంకర్, రంగానాథ్, రాజేష్, స్వామి తదితరులు ఉన్నారు.