సింగరేణి కార్మికులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

by Sumithra |
సింగరేణి కార్మికులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
X

దిశ, మందమర్రి : సింగరేణి కార్మికులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సేవలను సధ్వినియోగం చేసుకోవాలని మందమర్రి ఏరియా ఎస్ఓటు జీఎం రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి డైరెక్టర్(పా) ఆదేశాల మేరకు గురువారం స్థానిక జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సింగరేణి కాలరీస్ కంపెనీకి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారుల మధ్య ఒక అవగాహణ ఒప్పందం జరిగిందని అన్నారు. బ్యాంకు ఖాతా కలిగిన కార్మికునికి ప్రమాదం వల్ల మృతి చెందితే 20 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా కార్మికుడు డెబిట్ కార్డు నెలలో ఒక సారి ఉపయోగించుతే 10 లక్షల రూపాయల అదనపు భీమా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

కార్మికుడు ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందితే ఆ కుటుంబంలో 18 సంవత్సరాలలోపు పిల్లలు ఉంటే వారికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. ప్రమాదంలో ఉద్యోగికి అంగవైకల్యం కలిగితే ఏకంగా 20 లక్షల బీమా సదుపాయం కలుగుతుందని స్పష్టం చేశారు. కార్మికుడు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు రోజుకు 1000 రూపాయల చొప్పున 15 రోజుల పాటు ఆర్థిక సహాయం అందే విధంగా ఒప్పందం కుదిరిందని చెప్పారు. కార్మికులకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా అధిక ప్రయోజనాలు ఉన్న దృశ్య ఆ బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని రాజేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పి.ఓ విశ్రాంత్, డీవైపీఎం ఆసిఫ్ అన్ని గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed