- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సింగరేణి కార్మికుడి మృతి
దిశ, నస్పూరు: విధులు నిర్వహిస్తూ గుండెపోటు రావడంతో సింగరేణి కార్మికుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం ఉదయం షిఫ్టులో శ్రీరాంపూర్ ఏరియా వర్క్ షాప్ లో విధులు నిర్వహిస్తుండగా విలాసారపు శ్రీనివాస్ అనే జనరల్ మజ్దూర్ సింగరేణి కార్మికుడు గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. గుండెపోటు వచ్చిన అతనికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆటో గ్యారేజీ మెయిన్ గేటు మూసివేయడంతో ఆటో గ్యారేజీ లోపలి నుంచి వర్క్‌షాప్ మెయిన్ గేటు దాకా నడిపించుకుంటూ తీసుకురావడంతో ఆలస్యం అయ్యిందని కార్మికులు చెబుతున్నారు. శ్రీనివాస్ ఆర్‌కే 6 గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆర్కే 6 గని నుండి డిప్యూటేషన్ పై ఏరియా వర్క్ షాప్‌కి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మృత్యువాత పడటంతో వర్క్‌షాపులో విషాదఛాయలు అలముకున్నాయి.