- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. సింగరేణిలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: సింగరేణిలో ఉద్యోగాల కోసం యాజమాన్యం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి సీఅండ్ఎండీకి బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇందులో ఎగ్జిక్యూట్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ 2 గ్రేడ్ 139 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్అండ్ఏ) ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్) ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (ఐఈ) ఈ 2 గ్రేడ్ 10 పోస్టులు, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, ఈ 1 గ్రేడ్ 10 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (హైడ్రో జియాలజిస్టు) ఈ 2 గ్రేడ్ 2 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) ఈ 2 గ్రేడ్ 18 పోస్టులు, జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ ఈ 1 గ్రేడ్ 3 పోస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈ 3 గ్రేడ్ 30 పోస్టులు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సబ్ ఓవర్సీర్ ట్రైనీ, టీఅండ్ఎస్ గ్రేడ్ సీలో 16 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి వెబ్సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 18 అని వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తులను కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు https://www.scclmines.com మార్చి 1 నుంచి వెబ్సైట్లో చూసుకోవచ్చని యాజమాన్యం వెల్లడించింది.