ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా...

by Sumithra |
ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా...
X

దిశ, చింతలమానెపల్లి : చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బురదలో దిగబడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు, స్థానికుల సహాయంతో బురదలో కూరుకుపోయిన బస్సును రోడ్డుపైకి తీసుకువచ్చారు. బాబాసాగర్ గ్రామంలో ప్రధాన రహదారి గజానికో గుంతగా మారి ఉంది. ఈ రహదారిపై నుంచే నిత్యం రవాణా కొనసాగుతుంది.

ఈ రహదారి పై నుంచే మండల అధికారులు, పాలకులు, ప్రయాణించినా చీమ చిటుక్కుమని కుట్టే అంత నొప్పి కూడా వాళ్లకు లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి పై నుంచే కౌటాల మండలం ముత్యం పేట్ గ్రామం మీదుగా పరిమితిని మించి అధిక లోడ్ వేసుకుని ఒకేసారి పది లారీలు నిత్యం మహారాష్ట్ర వైపు వెళుతూ రోడ్లును పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు గుంతలు పూడ్చేసి రహదారులను బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story