విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించాలి

by Sridhar Babu |
విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించాలి
X

దిశ, వేమనపల్లి : విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుండి పఠన నైపుణ్యం పెంపొందించాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శనివారం మం డలంలోని నీల్వాయి ఎంపీయూపీఎస్ పాఠశాలలో మోడల్ లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో స్వతంత్ర పాఠకులుగా మారతారని, రూమ్ టు రైడ్ ఇండియా వారు మోడల్ లైబ్రరీని అన్ని మండలాల్లో పట్టణ నైపుణ్యం కోసం ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ చౌదరి, ఎంఈఓ శ్రీధర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గిరిధర్ రెడ్డి, మధుకర్, రూమ్ టూ రీడ్ అధికారి సుచరిత, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed