- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
దిశ, లోకేశ్వరం : ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచినందున విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధికారుల హాస్టళ్ల సందర్శన కార్యక్రమంలో భాగంగా శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలో గల బీసీ, ఎస్సీ హాస్టళ్లను ఆయన తహసీల్దార్ మోతీరామ్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం పక్షం రోజులకు ఒకసారి తహసీల్దార్ హాస్టళ్లను ఆకస్మికంగా సందర్శిస్తారని, ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం గుడ్లతో పాటు పండ్లు ఇవ్వాలని సూచించారు. హాస్టళ్ల లో ప్రత్యేక ట్యూటర్స్ ను నియమించి తరగతులు నిర్వహించాలని కోరారు. ఆహారంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలని అన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోతీరాం, విద్యార్థులు పాల్గొన్నారు.