నకిలీ వైద్యులతో ప్రైవేట్ దవాఖానాలు..పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం

by Aamani |
నకిలీ వైద్యులతో ప్రైవేట్ దవాఖానాలు..పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం
X

దిశ,ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిరుమల పిల్లల జనరల్ హాస్పిటల్ లో ఎంబీబీఎస్ పూర్తి కానీ వారిని నియమించి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన సిరిపురం మల్లవ్వ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా అధిక బిల్లులు వేశారని కుటుంబ సభ్యులకు తెలిపారు.శుక్రవారం రోజున కుటుంబ సభ్యులు హాస్పిటల్ వెళ్లి యాజమాన్యాన్ని ఎందుకు అధిక బిల్లు వసూలు చేస్తున్నారని నిలదీశారు. ఆసుపత్రికి చేరుకున్న పట్టణ వాసులు ఆసుపత్రికి అనుమతి ఉందా, వైద్యులు సరైన వైద్యుల అని ప్రశ్నించగా ఆసుపత్రి యజమాని వైద్యులకు ఇంకా ఎంబీబీఎస్ పూర్తి కాలేదని, ఆసుపత్రికి అనుమతి కూడా తీసుకోలేదని ఆసుపత్రి యజమాని తెలపడంతో అవక్కైరు. కాలనీవాసులు, కుటుంబ సభ్యులు గొడవకు దిగి ప్రజల ప్రాణాలతో ,సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కనబడుతుందని స్థానిక ప్రజలు మండిపడ్డారు. అనంతరం అనుమతి లేని ఆస్పత్రిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారి..

అనుమతులు లేకుండా ప్రయివేటు ఆసుపత్రిలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా వైద్య అధికారి రాజేందర్ అన్నారు.ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న తిరుమల పిల్లల హాస్పిటల్ ను శుక్రవారం రోజున తనిఖీ చేశారు. హాస్పిటల్ కి ప్రభుత్వ అనుమతులు లేవని రెండు రోజుల్లో అనుమతులు తీసుకోకుండా ఉంటే ఆసుపత్రి ని సీజ్ వేస్తామని తెలిపారు.అర్హత లేని వైద్యులతో ఆసుపత్రిని నియమించారని తెలిపారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య అధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed