- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : ఎమ్మెల్యే కోనేరు కొనప్ప
దిశ, చింతలమానేపల్లి : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి అని ఎమ్మె్ల్యే కోనేరు కోనప్ప అన్నారు. జిల్లాలోని చింతలమానెపల్లి మండలం బాబాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి, ఫిర్యాదుల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలంలోని బాబాపూర్, రనవెల్లి, లంబాడీహెట్టి, గంగాపూర్ తదితరుల గ్రామాల్లోని ప్రజలు మొత్తం 169 ధరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ మస్కూర్ అలీ తెలిపారు.
ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పేరు తప్పుగా రావడం, కొత్త పట్టాపాస్ బుక్కులు రాకపోవడం, ఆన్ లైన్ లో భూవిస్తీర్ణం చూపకపోవడంతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని వివిధ సమస్యల పై దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని వెంటనే ఆన్లైన్ లో ధరఖాస్తులు చేశామని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, ఎంపీపీలు, జడ్పీటీసీ ఎంపీడీవో, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.