బిల్లులు ఇప్పించండి మహాప్రభో..

by Sumithra |
బిల్లులు ఇప్పించండి మహాప్రభో..
X

దిశ, తలమడుగు : మరుగుదొడ్డి కట్టండి ఆరోగ్యాన్ని పరిసరాల పరిశుభ్రత పాటించండి, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం పొందండి అని ఓ ఊదరగొట్టిన యంత్రాంగం, వారి మాటలు నమ్మి అప్పుతెచ్చి మరీ మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మాత్రం మొండిచెయ్యే మిగిలింది. అధికార యంత్రాంగం బిల్లులను మరుగున పడేశారు. అటు అధికారులు ఇటు నాయకుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంలా తయారు అయ్యింది. మరుగుదొడ్లు నిర్మించుకొని ఏళ్ళు గడుస్తున్నా కేవలం సగం బిల్లు ఆరు వేలు మాత్రమే వచ్చాయని, మిగతా బిల్లులు రావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఆఫీస్ ల చుట్టు తిరిగి అధికారులు అడిగిన ప్రతి సారి జిరాక్స్ లు ఇచ్చి, చివరకు వస్తాయో రావో అనే సందిగ్ధంలో ఉన్నామని వాపోయారు.

మరుగుదొడ్డి కట్టే వరకు హడావిడి చేసే యంత్రాంగం తీరా కట్టిన తర్వాత సగం బిల్లు ఇచ్చి మిగతా బిల్లు ఎక్కడ అంటే మాత్రం వారి నుండి ఎటువంటి చప్పుడు లేదు. ఇగో వస్తాయి అదిగో వస్తాయి అనే మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. నిర్మించే వరకు ఇంటికి వచ్చి మరి కట్టాలి లేకుంటే ప్రభుత్వ వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయానని భయపెట్టి మరి కట్టించారు అని లబ్ధిదారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు సర్వేల పేరిట హడావిడి చేసి లబ్ధిదారుల ఫొటోలు మరుగుదొడ్డి పోటోలు వ్యక్తిగత వివరాలు తీసుకుని బిల్లు వస్తున్నాయ్ అనే మాటలే చెబుతున్నారు. తప్ప ఇప్పటి వరకు రావడం లేదని దిశ న్యూస్ కు తెలిపారు. ప్రభుత్వాలు మారిన అధికారులు మారుతున్నా లబ్ధిదారులకు మాత్రం న్యాయం జరగడం లేదు ఇకనైనా అధికార యంత్రాంగం, నాయకులు కల్పించుకొని నిజాయితీగా అధికారుల మాటలు నమ్మి నిర్మించుకున్న లబ్ధిదారులు లకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story