పెండింగ్ వేతనాలు చెల్లించాలి

by Naresh |
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
X

దిశ, ఆదిలాబాద్: గ్రామాలలో ప్రజల వద్దకే వెళ్లి వైద్య సౌకర్యం అందిస్తున్న 104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా 104 సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. 104 ఉద్యోగులు గత 16 సం లుగా చాలీ చాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు 1350 మంది పనిచేస్తున్నారని తెలిపారు. 2021లో 104 వాహనాలను నిలిపి వేసిన అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 5 నేలల వేతనాలు చెల్లించాలని, అన్ని అర్హతలు కలిగి ఉన్న104 ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని 104 ఉద్యోగులకి బేసిక్ పే ర్తింప చేయాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు ఆనంద్, సురేందర్, నగనత్, సుభాష్, ఇబ్రహీం, వెంకన్న, ప్రశాంత్, సంధ్య, పద్మ, శ్రీకాంత్, అశోక్ రెడ్డి, పురుషోత్తం, వామన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed