ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

by Naresh |
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
X

దిశ, కడం: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జ పటేల్ అన్నారు. శుక్రవారం దస్తురాబాద్ మండలంలోని మున్యాల్ గోండు గూడా గ్రామంలో ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జ పటేల్ దంపతులు శివుడితో పాటు కులదేవతలకు, శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని శివరాత్రి సందర్భంగా నాగ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్, కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను నాగు స్వామి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వసి అరాఫత్, కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed