- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి ఉద్యోగులకు డబుల్ బెడ్ రూమ్ గృహాలు..!
దిశ, మందమర్రి: సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉద్యోగం నెలకు దాదాపు లక్షకు పైగా జీతం. అతనికి గృహం, నీరు, విద్యుత్తు సరఫరా వాహనానికి పెట్రోల్ అలవెన్స్, సింగరేణి వార్షిక లాభాల వాటా, ఐదు సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు పెంపు, లాభాల బోనస్, గృహం నిర్మించుకుంటే 10 లక్షల వడ్డీ లేని రుణం, వైద్య సౌకర్యం తదితరులను అందజేస్తున్న సిరుల మాగాని సింగరేణి ఉద్యోగుల భార్యామణులకు డబుల్ బెడ్ రూమ్ గృహాలకు అర్హత లభించిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.
అవునండి మీరు చదివింది నిజమే. ఈ పథకానికి అర్హత సాధించాలి అంటే మీరు మీ పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకులకు కానీ, రేషన్ డీలర్స్ కు కానీ 1,50,000 ఇచ్చారంటే కచ్చితంగా మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేస్తుందట. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలదే కీలక పాత్ర అనే విమర్శలు సర్వత్ర పట్టణంలో వినిపిస్తున్నాయి. మందమర్రి మున్సిపాలిటీలోకి ఈ మధ్య బదిలీ పై వచ్చిన ఒక ఉద్యోగి ఈ తతంగంలో కీలక భూమికను పోషించినట్లు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే మందమర్రి మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ గృహాలకు దాదాపు 2500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి మొదటి, రెండవ వారంలో స్థానికేతర అధికారులు, స్థానిక మున్సిపల్, రెవెన్యూ అధికారులతో దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 28న మున్సిపల్ కార్యాలయంలో డబల్ బెడ్ రూమ్ గృహాల లబ్ధిదారుల జాబితాలో 521 మంది ఎంపికైనట్లు కార్యాలయం ముందర వార్డుల వారీగా అధికారులు ప్రకటించారు. ఈ జాబితా ప్రకటించిన మొదటి దశలోనే ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆగ్రహవేషాలు వెల్లువెత్తాయి.
ఈ వ్యతిరేకతను గమనించిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ తహసీల్దార్ తదితరులు గృహాల అనర్హుల విషయంలో మరో దఫా విచారణ జరిపిస్తామని, ప్రజలకు ఏమైనా అపోహలు కానీ ఫిర్యాదులు ఉంటే పరిశీలిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుండి వచ్చిన వందల ఫిర్యాదుల పై విచారణ జరిపించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మార్చి 17 నాడు డబుల్ బెడ్ రూమ్ గృహాల ఎంపిక లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుందని శనివారం ప్రకటన వెలువడడం మరో కొత్త వివాదానికి తేరలేపినట్లు అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో అధికార పార్టీ జిల్లా యంత్రాంగం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.