Nirmal: సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ.. అన్నదాతకు కొత్త ఆశలు

by Ramesh Goud |
Nirmal: సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ.. అన్నదాతకు కొత్త ఆశలు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. దశాబ్దకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రైతుల కోసం సర్కారు నిర్ణయం అన్నదాతలకు కొత్త ఆశలు కలిగిస్తున్నది.

భారీగా నిధులు... సర్కారు ప్రతిపాదనలు

నిర్మల్ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం భారీ ప్రణాళికను తయారు చేసింది. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ అధికారులు సర్కారుకు పంపారు. ముధోల్ నియోజకవర్గం లోని మూడు మండలాలకు సాగునీటితో పాటు మిషన్ భగీరథ తాగునీటి పంపిణీకి సంబంధించి ఉన్న గడ్డన్న వాగు ప్రాజెక్టు అభివృద్ధికి 50 కోట్ల నిధులతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో ప్రాజెక్టు కరకట్ట మరమ్మతులతో పాటు కాలువలో లైనింగ్ డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. 14వేల ఆయకట్టు లక్ష్యం కాగా ప్రస్తుతం 6, ఎకరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టు నీరు అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 2023 సంవత్సరంలో భారీ వరదలకు కొట్టుకుపోయిన సిరాల సాగునీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్లు మంజూరు చేసింది ఇప్పటికే ఈ ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభం అయ్యాయి. అక్కడి శాసనసభ్యుడు రామారావు పటేల్ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం 17 గేట్లు ఉండగా నాలుగు గేట్లు బిగించనున్నారు. ఎందుకు 20 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు కాలువల లైనింగ్ కోసం తొమ్మిది కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులు వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు త్వరలోనే మోక్షం కలుగుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed