- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌హెచ్‌ఎం స్కీం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
దిశ, ఆసిఫాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజలకు సేవ అందిస్తున్న. ప్రభుత్వం వీరిని పట్టించుకోకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తుందని ఆరోపించారు.
కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. కాగా 7 నెల ఏరియాస్ బకాయిలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1. 2 వ తేదీల్లో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దిన్ కర్. చిరంజీవి. ఏఎన్ఎం సంఘం జిల్లా అధ్యక్షురాలు సంతోషి. ప్రధాన కార్యదర్శి పుణ్యవతి, నాయకులు భూదేవి, సునీత తదితరులు ఉన్నారు.