సింగ‌రేణిలో కొత్త ఒర‌వ‌డి

by Kalyani |
సింగ‌రేణిలో కొత్త ఒర‌వ‌డి
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : బాగా పనిచేసే కార్మికులకు సంస్థ ఉన్నతాధికారి స్వయంగా అభినందనలు తెలిపితే అంతకు మించిన ఆనందం ఆ ఉద్యోగులకు మరేది ఉండదు. ఇటువంటి చర్యలు ఉద్యోగులలో మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతాయి. ఉత్పత్తి కూడా ఘనంగా పెరుగుతుంది. ఈ వినూత్నమైన ఆలోచనకు సింగ‌రేణి సీఅండ్ఎండీ బ‌ల‌రాం శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న శుక్ర‌వారం కార్మికుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మ‌రీ ఉద్యోగుల‌ను అభినందించారు.

రామగుండం 3 ఏరియాలోని ఆర్జీ ఓపెన్ కాస్ట్ 1లో ప్రొడక్షన్ డే పేరుతో ఒక్కరోజులో అత్యధిక ఉత్పత్తి సాధించాలని నిర్ణయించుకున్నారు. నిర్దేశిత 10 వేల టన్నులకు అదనంగా మరో ఎనిమిది వేల టన్నులను జోడించి మొత్తం 18,144 టన్నుల ఉత్పత్తి సాధించి గని చరిత్రలోనే అత్యధిక రికార్డును నెలకొల్పారు. షావెల్స్, డంపర్లు కూడా 20 గంటలకు పైగా పని చేశాయి. ఉత్పాదకత లో సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ గని అధికారులు, కార్మికులతో స్వయంగా మాట్లాడారు. కష్టపడిన కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గ‌తంలో ఉన్న సీఅండ్ఎండీ ఎవ‌రు కూడా త‌మ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడ‌లేద‌ని, అలాంటిది సీఅండ్ఎండీ త‌మ‌ను ప్ర‌త్యేకంగా అభినందించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని కార్మికులు ఆనందాన్ని పంచుకున్నారు. "మేము కూడా రోజుకి 20 గంటలు పైగా పనిచేస్తాం. అత్యధిక ఉత్పత్తి సాధిస్తాం. చైర్మన్ గారి అభినందనలు అందుకుంటాం" అంటూ పలు గనుల్లో కార్మికులు అధికారులు ముందుకు వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed