బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమం

by Sridhar Babu |
బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమం
X

దిశ, మంచిర్యాల : బీసీ కుల గణన కోసం ఇక దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ వరకు నిర్వహించిన బీసీ కుల గణన చైతన్య యాత్ర ముగింపు సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్​ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుల గణన నిర్వహించి బీసీల లెక్కలు తేల్చాలని మూడు దశాబ్దాలుగా చేసిన పోరాటం నేడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ఫలప్రదమైందన్నారు. బీసీ కుల గణన చారిత్రాత్మకమైన అంశమని అన్నారు. బీసీల లెక్కలు తేలాక జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్ తేలుతుందన్నారు. బీసీ కుల గణనను అడ్డుకోవాలని చూసిన కొన్ని శక్తులు ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ కోణంలోనే మహారాష్ట్ర, కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిందన్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలని పిలుపునివ్వడంతోనే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, బీసీలంతా ఏకతాటిపై ఉన్నట్లుగా భావించవచ్చని ఈ విజయాలతో తేలిపోయిందన్నారు. 60 శాతం బీసీలు ఉన్నా ఆర్థికంగా, రాజకీయంగా వెనకబాటుతనానికి గురవుతున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగి బీసీల ఐక్యతను ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రంలో రెడ్డి, వెలమ కులాలతోనే రాజకీయాలు నడుస్తున్నాయని, ఒకరి తర్వాత ఒకరు పాలన సాగిస్తూ బీసీ, ఎస్సీలకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీసీలందరూ మేల్కొని జాగృతం కావాలన్నారు.

చట్టసభల్లో బీసీలు అడుగు పెట్టేలా ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. రాష్ట్రంలో కోటి 17 లక్షల 36 వేల కుటుంబాలకు కుల గణన స్టిక్కర్ వేయడం జరిగిందని , 56 సంచార కులాలకు స్టిక్కరింగ్ సర్వే ఫారాలు నింపలేదని, వారికిఇండ్లు లేవని అధికారులు కారణం చెప్పడం సరికాదన్నారు. వారు ఉంటున్న చోట సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. 2028 ఎన్నికల్లో 60 మంది బీసీ ఎమ్మెల్యేకు, 9 మంది ఎంపీ స్థానాల్లో బీసీలు బరిలో ఉండి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్డ్, గణేష్​చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంటేశ్వర్​గౌడ్, జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గౌడ్, రాంశెట్టిన నరేందర్, వెంకటేష్, శంకర్, రాజన్న, రాజన్న యాదవ్, నరెడ్ల శ్రీనివాస్, రమేష్, రంజిత్ గౌడ్, రవియాదవ్, కార్తీక్, దత్తు, రమేషాచారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed