- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిచ్చికుక్కలు, పందుల నివారణకు చర్యలు తీసుకోవాలి..
దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లిలో పిచ్చికుక్కలు, పందుల బెడదను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ అధ్యక్షతన సోమవారం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. పట్టణంలో చాలాకాలంగా కుక్కలు, పందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సభ్యులు వాపోయారు. అందుకు కమీషనర్ ఆకుల వెంకటేశ్ స్పందించారు. కుక్కల, పందుల బెడదను నివారించేందుకు ఇకనుంచి ప్రత్యేకంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పారిద్యం పై మరింతగా శ్రద్ధ పెట్టి మెరుగుపరచాలని కూడా సమావేశంలో చర్చించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కమిషనర్ వెంకటేశ్ సమాధానం ఇచ్చారు. మురుగు కాలువలను కూడా సకాలంలో పూడికలు తీసి శుభ్రం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎజెండాలోని పలు అంశాలను సభ్యులు సమావేశంలో చర్చించి తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఆయా శాఖల అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.