బెల్లంపల్లి మున్సిపల్ వార్షిక బడ్జెట్ రూ.18 కోట్ల 96 లక్షల 72 వేలు

by Naresh |
బెల్లంపల్లి  మున్సిపల్ వార్షిక బడ్జెట్ రూ.18 కోట్ల 96 లక్షల 72 వేలు
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ బడ్జెట్ సమావేశం సాదాసీదాగా జరిగింది. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన 2024- 25 వార్షిక అంచనా బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు. 2024 -25 వార్షిక బడ్జెట్ గా రూ.18 కోట్ల 96 లక్షల 92 వేలుగా నిర్ణయించారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పన్నుల రాబడి రూ.74 లక్షల, వివిధ గ్రాంట్ల ద్వారా రూ.13 కోట్ల 5 ఐదు లక్షలు. ఇతర డిపాజిట్ల ద్వారా రూ.17 లక్షలు మొత్తం అంచనా బడ్జెట్ రూ.18 కోట్ల 96 లక్షల 72 వేలు. కాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ విద్యుత్ చార్జీలు రుణ వాయిదా చెల్లింపు కొరకు రూ. 57 లక్షల 46 వేలు కేటాయించారు. ఇంజనీరింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ టౌన్ ప్లానింగ్ కొరకు రూ. 60 లక్షల 60 వేలు, 1/3 వంతు మిగులు బడ్జెట్ గా రూ. 5 లక్షల 79,000, వార్డుల అభివృద్ధి కొరకు రూ. 11,59,000 కేటాయించారు.

వార్షిక బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించడం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత హర్ష వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సభ్యులు తగిన సహకారం అందించాలన్నారు. అందరం కలిసి సమిష్టిగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం తగినన్ని నిధులను మంజూరుకు కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. మున్సిపల్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మేనేజర్ కే శ్రీనివాస్, అకౌంటెంట్ అనితా దేవి, ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story