- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLA Payala Shankar : తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి..
by Sumithra |

X
దిశ, ఆదిలాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బేల మండలంలోని టాక్లి గ్రామంలో పాయల ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అంతకు ముందు బేల మండలంలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు స్వచ్ఛమైన నీరు అందించడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామస్తులు తమకు ఎటువంటి సమస్య ఎదురైన వెంటనే తనను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story