- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలుపండ్లు అయ్యాయి.. పుస్తె కట్టడమే మిగిలింది : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిర్మల్ : పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగే పూలు పండ్లు కార్యక్రమం ముగిసిందని పుస్తె కట్టడం ఒకటే మిగిలిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని త్వరలోనే ఆయన పార్టీ మారడం ఖాయమని మంత్రి అల్లోల జోష్యం చెప్పారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ రూరల్ మండలం భారత్ రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష..
భారత్ రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఏ ఒక్క పార్టీకి లేనంత స్థాయిలో ఒక్క రాష్ట్రంలోనే 60 లక్షల మంది పార్టీ సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని చెప్పారు. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన నిర్మల్ లో తాము గెలవబోతున్నామని రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో మూడోసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి పార్టీ యువ నాయకులు గౌతమ్ రెడ్డి మురళీధర్ రెడ్డి ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ఎల్లపెల్లి గోవర్ధన్ రెడ్డి గంగాధర్ మార్కెట్ చైర్మన్ చిలుక రమణ గ్రంధాలయ చైర్మన్ రాజేందర్ నాయకులు పాల్గొన్నారు.