77 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు..

by Sumithra |
77 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు..
X

దిశ, సారంగాపూర్ : కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో సారంగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు రెక్కాడితే గాని డోక్కాడని పేదలు తమ ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి, ఆ అప్పులకు మిత్తిలు కట్టి అనేక ఇబ్బందులు పడే వారన్నారు. ఈ ప్రపంచంలోనే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఇంటి మేనమామగా మారి ఆడబిడ్డ పెళ్లికి రూ1,00,116/- కానుక అందిస్తున్నారన్నారు.

గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉండే పరిస్థితి ఉండేదని, నేడు 24 గంటలు విద్యుత్తు, పుష్కలంగా నీరు ఉందని మంత్రి కొనియాడారు. పేదలకు, వృద్ధులకు వితంతువులకు ఆసరా పింఛన్లు, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ను బలోపేతం చేయాలని, కేసీఆర్ నిండు నూరేళ్లు బ్రతికేలా దీవెనలు, ఆశీర్వచనాలను అందివ్వాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయత సమితి అధ్యక్షులు నల్ల వెంకటరామిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ఎంపీపీ అట్ల మైపాల్ రెడ్డి, అడెల్లి టెంపుల్ చైర్మన్ ఐటి చందు, ప్యాక్స్ చైర్మన్ మాణిక్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో సంతోష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సుజాత నర్సారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story