- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీకటి జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారు : ఎంపీ వెంకటేష్ నేత
దిశ,నస్పూర్ : కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో టీబీజీకేఎస్ నాయకులు సింగరేణి కార్మికులు,రిటైర్డ్ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్నుపై మినహాయింపు ఇవ్వాలనే అంశాన్ని అనేకసార్లు పార్లమెంట్లో ప్రస్తావించానని అయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.
సింగరేణి గుర్తించిన నాలుగు బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని,కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు,మాజీ శాసనసభ్యుడు గడ్డం అరవింద్ రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, జనరల్ సెక్రటరీ కెంగర్ల మల్లయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య,తదితరులు పాల్గొన్నారు.