- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జారిపడి ఇచ్చోడ అటవీశాఖ అధికారి మృతి
దిశ, ఇచ్చోడ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో బాత్ రూమ్‌లో కాలు జారీ పడి ఇచ్చోడ అటవీ శాఖ అధికారి జాధవ్ పాండురంగ్ శనివారం మృతి చెందారు. ఇచ్చోడ మండలంలో ఎఫ్ఆర్వోగా విధులు నిర్వహిస్తున్న జాధవ్ పాండురంగ్ అపెండిక్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం నిర్మల్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అపెండెక్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. హాస్పిటల్‌లో బాత్ రూమ్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కాళు జారి పడి తీవ్ర గాయాలయ్యాయి.
పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందారు. ఎఫ్ఆర్వో మృతి చెందడంతో స్థానిక అటవీశాఖ అధికారులు, సిబ్బంది, దిగ్భ్రాంతికి లోనయ్యారు. అంత్యక్రియలు నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.