- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి.. ఎమ్మెల్యే బొజ్జు
దిశ, ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలో అశ్వరావ్ పేట ఎమ్మెల్యే ఆది నారాయణ, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలసి ఆయన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ ని కలిశారు. గిరిజన ప్రాంత గ్రామాల అనుసంధానం కొరకు రోడ్లు మంజూరు, మౌళిక వసతుల కొరకు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, కమ్యూనిటీ హల్స్, సర్వే పూర్తి అయిన అటవీ భూములకు పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
గిరి వికాసం ద్వారా ఆదివాసీ రైతులందరికి బోర్ వెల్స్, కరెంట్ మోటార్స్ మంజూరు చేపించి, ఆశ్రమ క్రీడా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్, ఆట వస్తువులు మంజూరు చేయాలని, సీఆర్టీలకు టైమ్ స్కెల్ వేతనాలు ఇవ్వాలని, సీఆర్టి, ఏఎన్ఎం, దినసరి వర్కర్ల పెండింగ్ వేతనాలను విడుదల చేసి, ప్రతి జిల్లా కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రములు, పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రములు మంజూరు చేయాలన్నారు. ఐటీడీఏలలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి, పేసా కో ఆర్డినేటర్ ల వేతనాలను విడదల చేసి, పీవీటీజీ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.