- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి.. మంత్రి సీతక్క
దిశ, ఉట్నూర్ : గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అన్నారు. శనివారం ఉట్నూర్ లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమాలలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క ఉట్నూర్ కి రావడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్, ఎమ్మెల్యే విఠల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణక్క, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ స్వాగతం పలికారు.
మండలంలో పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శంభూగూడ నుండి శివనూర్ గ్రామం వరకు 3 కోట్ల 24 లక్షల రూపాయలతో బీటి రోడ్, లక్కారం నుండి చింతగూడ వరకు 8 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేశారు. అక్కడి నుండి గొండ్ గూడ పంచాయతీ కి 25లక్షలతో నూతన నిర్మించిన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీని సన్మానించారు. మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.