సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై దృష్టి పెట్టాలి

by Naresh |
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై దృష్టి పెట్టాలి
X

దిశ, ఆసిఫాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణకు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అప్రమత్తంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే వారి పై దృష్టి సారించి. చట్ట ప్రకారం కఠిన చర్యలు బైండోవర్ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డీఎస్పీఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు ఉన్నారు.

Advertisement

Next Story