- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పాఠశాలకు పూర్వ వైభవం వచ్చేనా..
దిశ, చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన జేబీఎస్ పాఠశాల పరిస్థితి శిథిలావస్థకు చేరుకునే దిశగా తయారైంది. ప్రస్తుత పరిస్థితుల్లో నల్లేరుపై నడకలా కొనసాగుతుంది. పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలోని ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత పదవులలో ఉన్నారు. ఎంతోమంది విదేశాలలో కూడా ఉజ్వల భవిష్యత్తును అనుభవిస్తున్నారు. ఈ పాఠశాల పట్టణంలోనే ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందాలంటే అధికారుల, నాయకుల రికమెండేషన్ అవసరం ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులలో పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాఠశాల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైంది.
గతంలో ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల పరిస్థితిని చూసి నాయకులు, అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రసిద్ధిగాంచిన పాఠశాల శిథిలావస్థకు చేరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్థానిక నాయకులు చొరవ చూపి"మన ఊరు మన బడి" కార్యక్రమం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. అవసరమైతే ఈ పాఠశాలకు దగ్గర్లో ఉన్న యూపీఎస్ పాఠశాలలో కూడా సరైన విద్యార్థులు, వసతులు లేక నామమాత్రంగా నడుపుతున్న క్రమంలో ఈ పాఠశాలలో విలీనం చేసి తిరిగి పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు.