తరగతులు ప్రారంభమయ్యాయి కాని.. నిర్మాణాలు పూర్తి కాలేదు..

by Sumithra |
తరగతులు ప్రారంభమయ్యాయి కాని.. నిర్మాణాలు పూర్తి కాలేదు..
X

దిశ, మందమర్రి : 2023-24 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కాని గత సంవత్సరం తలపెట్టిన పాఠశాల నూతన భవన నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. గత సంవత్సరం మనఊరు మనబడి పథకం కింద పాఠశాలకు రెండు తరగతి గదులు, స్త్రీ పురుషులకు వేరు వేరు మరుగుదొడ్లు, వంటశాల తదితరుల నిర్మాణాల కొరకు 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. గత వేసవికాలం పాత భవనాన్ని పూలగొట్టి కొత్త భవనానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన అవి నత్తనడకలో నడవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణంలో నిధుల కొరత సమస్య తలెత్తడంతో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. గత 20 రోజుల నుండి భవన నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్ రాత్రి పగళ్ళు చకచకా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పగలు చేసే పనులలో ఇబ్బందులు ఎదురవుతుంటే సదరు పాఠశాల కాంట్రాక్టర్ రాత్రి పనులు నిర్వహించడం పట్ల భవన నిర్మాణం ఎలా ఉంటుందో అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

7 తరగతులు... ఇద్దరు ఉపాధ్యాయులు

రెండవ జూన్ మందమర్రి రైల్వే స్టేషన్ రోడ్డు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 7 తరగతులు నిర్వహిస్తుండగా కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విద్యను బోధించడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంగ్లీష్ మీడియం ఒకటవ తరగతిలో 119 మంది, రెండులో 20 మంది, మూడులో 16, నాలుగులో 26, ఐదులో 27, ఆరులో 15, ఏడవ తరగతిలో 16 మంది వివిధ తరగతుల్లో విద్యార్థినివిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అటెండర్, ఆయా వృత్తులను సైతం ఆ ఇద్దరు ఉపాధ్యాయులు చేయడం గమనార్హం.

నిద్రావస్ధలో సరస్వతి నిలయం..

మందమర్రి రెండవ జోన్ ప్రాథమికొన్నత పాఠశాలకు దాదాపు 50 సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. అయినా ఈ పాఠశాలను అటు పాలకులు ఇటు విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పై పెద్ద ఎత్తున పట్టణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో నిద్రావస్టలో ఉన్నసరస్వతి నిలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed