- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళారులను నమ్మి మోసపోవద్దు.. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్..
దిశ, ఇచ్చోడ : ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, దళారులను నమ్మి రైతన్నలు మోస పోవద్దని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో శనివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధిక ధరలకు కొంటామని నమ్మబలికి పూర్తి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అందుకే రైతులు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని, అధికారులు కూడా రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు.
ఐకేపీ ట్రాక్టర్ ప్రారంభం..
ఇచ్చోడ ఐకేపీ అరుణోదయ మండల సమైక్య ట్రాక్టర్, వాటి పరికరాలకు ప్రత్యేక పూజలు చేసి బోథ్ ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళ సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డ్వాక్రా గ్రూప్ సంఘాలకు పావలాకే వడ్డీ రుణాలను అందజేస్తున్నదని చెప్పారు. అనంతరం పలువురి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణా రెడ్డి, స్థానిక సర్పంచ్ సునీత, ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, ఉపసర్పంచ్ లోక శీరీష్ రెడ్డి, ఎంపీటీసీ నిమ్మల శివకుమార్ రెడ్డి, నాయకులు సుద్దవార్ వెంకటేష్, ముస్తఫా, రాథోడ్ ప్రవీణ్, గాయికాంబ్లీ గణేష్, ఆర్గులగణేష్, రాథోడ్ ప్రకాష్, బలగంరవి తదితరులు పాల్గొన్నారు.