ఆడ పడుచులకు మేనమామ కేసీఆర్ : Boath MLA Rathod Bapu Rao

by Sumithra |   ( Updated:2022-12-16 12:40:18.0  )
ఆడ పడుచులకు మేనమామ కేసీఆర్ : Boath MLA Rathod Bapu Rao
X

దిశ, ఇచ్చోడ : కళ్యాణ లక్ష్మీ పథకం అమలుతో సీఎం కేసీఆర్ ఆడపడుచులకు మేన మామగా మారిపోయడని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ అన్నారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో 41 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాధిముబారక్ చెక్కులు, మరో ముగ్గురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు అన్నివర్గాల ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో అద్భుత పథకాలతో, యావత్ దేశం అబ్బుర పర్చే విధంగా సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణా రెడ్డి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, నాయకులు మేరాజ్, ముస్తఫా, వెంకటేష్, మహేందర్ రెడ్డి, హారన్ సుభాష్, గాయికాంబ్లీ గణేష్, తహసీల్దార్ రాథోడ్ మోహన్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ జాధవ్ రామారావు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed