అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

by Shiva |
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
X

దిశ, గుడిహత్నూర్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. శనివారం మండలంలోని ముత్నూర్ గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అని కొనియాడారు.

దళితులు విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడలేని విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేవలం తెలంగాణలో మాత్రమే నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, నాయకులు జంగు, దిలీప్,ఆశన్న, సిద్ధార్థ్, బడుగు గంగయ్య, పైఠానే ముకుంద్,మాధవ్, ధోండిబా, విశ్వంబర్, ఫుల్చంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story